మహారాష్ట్ర: లోకాయుక్త-2022 బిల్లుకి ఆమోదం
- December 28, 2022
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో చారిత్రాత్మక సందర్భం చోటు చేసుకుంది.లోకాయుక్త-2022 బిల్లుకి రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది.ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన మొట్టమొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. అయితే విపక్షాల గైర్హాజరు నేపథ్యంలో ఎలాంటి చర్చ జరక్కుండానే బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందడం గమనార్హం.ఈ బిల్లు ప్రకారం.. ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ లోకాయుక్త పరిధిలోకి వస్తారు.యూపీఏ-2 ప్రభుత్వం చివరి అంకంలో లోకాయుక్తపై దేశ వ్యాప్తంగా ఆందోళన చెలరేగింది.అన్నా హజారే చేపట్టిన ఆ ఆందోళనకు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ మద్దతు ఇచ్చింది.అయితే అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అయినప్పటికీ దీనిపై ముందడుగు పడలేదు.అయితే మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన (షిండే) ప్రభుత్వం ఈ బిల్లుకు ఆమోదం తెలపడం ఆసక్తికరం.
వాస్తవానికి లోకాయుక్తకు ఆమోదం తెలిపినప్పటికీ.. దీని అమలులో మహా ప్రభుత్వం కొన్ని కిటుకులు పెట్టింది. ఈ బిల్లు ప్రకారం.. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏదైనా విచారణ ప్రారంభించే ముందు అసెంబ్లీ ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుంది.సభ సమావేశాలకు ముందే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అలాంటి తీర్మానాన్ని భలోని మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల ఆమోదం పొందాలి.ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణలపై వచ్చిన అంశం.. రాష్ట్రంలో అంతర్గత భద్రత లేదంటే పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించిన విషయమని, దానిపై లోకాయుక్త విచారణ చేయరాదని కూడా పేర్కొంది.
లోకాయుక్తలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఛైర్‌పర్సన్‌గా ఉంటారు. సీఎం, డిప్యూటీ సీఎం, శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్, ప్రతిపక్షనేతలు సభ్యులుగా ఉంటారు. ఈ బిల్లు ప్రకారం.. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా లోకాయుక్త పరిధిలోకి వస్తారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. బిల్లును ఆమోదించిన అనంతరం సలహాలు, అభ్యంతరాలను స్వీకరించేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు.ఈ లోకాయుక్త చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఫడ్నవీస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







