చిరు లీక్స్: ‘వీరయ్య’లో రవితేజ పాత్ర గురించి లీక్ చేసేసిన మెగాస్టార్.!

- December 28, 2022 , by Maagulf
చిరు లీక్స్: ‘వీరయ్య’లో రవితేజ పాత్ర గురించి లీక్ చేసేసిన మెగాస్టార్.!

మెగాస్టార్ చిరంజీవి నోటిలో అస్సలు మాట దాగనే దాగదు. ముఖ్యంగా తను నటించబోయే సినిమాలకు సంబంధించి. గతంలో చాలాసార్లు ఇలాగే జరిగింది. అనుకోకుండా చిరంజీవి లీక్ చేసేయడంతో, స్పెషల్‌గా రిలీజ్ చేయాల్సిన అప్‌డేట్స్ సాదా సీదాగా హడావిడిగా రిలీజ్ చేయాల్సిన సందర్భాలు అనేకం గతంలో చూశాం.
తాజాగా ‘వాల్తేర్ వీరయ్య’ గురించిన ఓ అసలు సిసలు లీక్ కూడా చిరంజీవి నోట్లోంచి బయటికి వచ్చేసింది. సంక్రాంతికి సినిమా రిలీజ్ వున్న నేపథ్యంలో ప్రమోషన్లు షురూ చేశారు. అందులో భాగంగానే, ‘వాల్తేర్ వీరయ్య’ సెట్‌లో ప్రత్యేకంగా ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ఏమాత్రం తీసిపోకుండా వున్న ఈ ప్రెస్ మీట్‌కి చిత్ర యూనిట్‌ అంతా హాజరయ్యారు. సినిమాకి సంబంధించి పలు విషయాల్ని మీడియాతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి, రవితేజ పాత్ర సెకండాఫ్‌లో వస్తుంది.. అని నోరు జారేశారు. అయితే, యూనిట్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదనుకోండి. రవితేజ పాత్రకి సంబంధించి కొంత సీక్రెట్ మెయింటైన్ చేస్తూ వచ్చారింతవరకూ. కానీ, చిరు లీక్స్‌తో ఆ సస్పెన్స్‌కి తెర పడిపోయిందిలా.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com