12 ఏళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్.! ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.!

- December 29, 2022 , by Maagulf
12 ఏళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్.! ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.!

నాగ చైతన్య, సమంత కాంబినేషన్‌లో వచ్చిన ‘ఏ మాయ చేశావె’ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమా ద్వారానే సమంత హీరోయిన్‌గా పరిచయమైంది. 
అక్కడి నుంచే చై, సామ్ మధ్య స్నేహం కూడా విరిసింది. ఆ స్నేహమే ప్రేమగా పెరిగి పెద్దదై పెళ్లి వరకూ వెళ్లింది. పెళ్లయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారనుకోండి.
అసలు మ్యాటర్ ఏంటంటే, 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోందట. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి ఇన్నేళ్ల తర్వాత మంచి కాన్సెప్ట్‌తో సీక్వెల్ రూపుదిద్దుకుంటోందట. ఆల్రెడీ స్క్రిప్టు పనులు పూర్తయ్యాయనీ సమాచారం. 
ట్విస్ట్ ఏంటంటే, ఈ సినిమాలో హీరో నాగచైతన్యే కానీ, హీరోయిన్ సమంత కాదంట. రష్మికను హీరోయిన్‌గా తీసుకోబోతున్నారనీ తెలుస్తోంది. చై, సామ్ పర్సనల్ లైఫ్‌కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను ఈ సీక్వెల్‌లో చూపించబోతున్నారనీ టాక్ నడుస్తోంది.చూడాలి మరి.ఇది జస్ట్ ప్రచారమేనా.? నిజంగానే వారి వైవాహిక, విడాకుల జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను చూపిస్తారా.? అన్నది తెలియాలంటే ఇంకా చాలా టైమ్ వెయిట్ చేయాల్సి వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com