బాహుబలి అంటే ఆ మాత్రం వుండాల.! ప్రబాస్ దెబ్బకి ‘ఆహా’ క్రాష్.!

- December 30, 2022 , by Maagulf
బాహుబలి అంటే ఆ మాత్రం వుండాల.! ప్రబాస్ దెబ్బకి ‘ఆహా’ క్రాష్.!

తెలుగు ఓటీటీ ఛానెల్ ఆహా వేదికగా రన్ అవుతోన్న ‘అన్‌స్టాపబుల్’ సెకండ్ సీజన్‌లో ఓ వింత చోటు చేసుకుంది. బాలయ్య హోస్ట్‌గా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ టాక్ షోకి తాజాగా బాహుబలి ప్రబాస్ గెస్ట్‌గా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయ్.
ప్రోమోలు కూడా ట్రెండింగ్ అయ్యాయ్. అయితే, ఆ ఎపిసోడ్ స్ర్టీమింగ్ అయ్యే రోజు రానే వచ్చింది. డిశంబర్ 30 న స్ర్టీమింగ్ కావల్సిన ఈ ఎపిసోడ్, ఫ్యాన్స్ కోరిక మేరకు ఒక్క రోజు ముందే ఈ ఎపిసోడ్ స్ర్టీమింగ్ అవుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది ఆహా.
అయితే, ఎక్కువ మంది ఒకేసారి ఈ యాప్ వినియోగించినందు వల్ల ఒక్కసారిగా క్రాష్ అయ్యింది. యాప్ ఓపెన్ కాలేదు. దాంతో, సోషల్ మీడియాలో పలు విమర్శలు తలెత్తాయ్. ఇలా జరుగుతుందని ముందే గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి కదా.. అని ప్రబాస్ ఫ్యాన్స్‌తో పాటూ, నెటిజనం గుస్సా అయ్యారు. 
దాంతో టెక్నికల్ టీమ్ కిందా మీదా పడి, కష్టపడి యాప్‌ని తిరిగి అందుబాటులోకి వచ్చేలా చేసింది. అయితే, దీనంతటికీ మూడు గంటల పైనే సమయం పట్టింది. ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చిన ‘అన్‌స్టాపబుల్ ప్రబాస్’ ఎపిసోడ్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.
ప్రబాస్ పెళ్లి, సినిమాలూ.. ఇలా పలు ఆసక్తికరమైన అంశాలను బాలయ్య తనదైన శైలిలో ఈ షో ద్వారా ప్రబాస్ నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. బాహుబలి సినిమా మాదిరి రెండు పార్టులుగా ఈ ఎపిసోడ్‌ని టెలికాస్ట్ చేయనున్నారు. మొదటి పార్ట్ ప్రస్తుతం అందుబాటులో వుండగా, రెండో పార్ట్ జనవరి 6 నుంచి అందుబాటులోకి రానుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com