సౌదీ డాకర్ ర్యాలీ 2023.. 4వ ఎడిషన్ ప్రారంభం

- December 31, 2022 , by Maagulf
సౌదీ డాకర్ ర్యాలీ 2023.. 4వ ఎడిషన్ ప్రారంభం

సౌదీ: సౌదీ డకార్ ర్యాలీ 2023 నాల్గవ ఎడిషన్ శనివారం ప్రారంభమైంది. ఇది జనవరి 15, 2023 వరకు కొనసాగుతుందని తెలిపింది. రేసుల్లో భాగంగా వివిధ విభాగాలలో 453 వాహనాలు పాల్గొంటున్నాయి. ఇందులో డాకర్ క్లాసిక్ రేసులో 89 వాహనాలు కూడా ఉన్నాయి. యాన్బు నుండి ప్రారంభమయ్యే రేసు 8,500 కి.మీ కంటే ఎక్కువ దూరం సాగనున్నది. ఈ సంవత్సరం సౌదీ డాకర్ ర్యాలీ పోటీలలో పాల్గొనే ఎలైట్ డ్రైవర్లు, రైడర్లు, నావిగేటర్లను క్రీడా మంత్రి, సౌదీ ఒలింపిక్, పారాలింపిక్ కమిటీ ఛైర్మన్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కీ అల్-ఫైసల్ స్వాగతించారు. ఈ గ్లోబల్ ఈవెంట్‌కు 68 దేశాల నుండి డ్రైవర్లు పాల్గొంటున్నారు.

సౌదీ డాకర్ ర్యాలీ ట్రాక్ ప్రాథమిక దశతో పాటు 14 దశలలో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఎడిషన్ కొత్త ట్రాక్‌లను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది ఎర్ర సముద్రం ఒడ్డున ఉన్న యాన్బు నుండి కింగ్ డమ్ ఎడారి గుండా వెళుతుంది. యాన్బులోని అల్-బహర్ క్యాంప్ వేదిక నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. వాయువ్య పర్వత ప్రాంతాల నుండి అల్యూలా, హెయిల్, దావద్మీ, షైబా, హోఫుఫ్, దమ్మామ్, హరద్, ద ఎంప్టీ క్వార్టర్ గుండా వెళుతుంది.

మోటర్‌స్పోర్ట్స్‌లో అత్యంత పురాతనమైన రేసులలో డకార్ ర్యాలీ ఒకటి. ఇది అమౌరీ స్పోర్ట్ ఆర్గనైజేషన్ (ASO), సౌదీ మోటార్‌స్పోర్ట్స్ కంపెనీ సహకారంతో..  సంబంధిత స్థానిక అధికారుల సమన్వయంతో నిర్వహించబడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com