కృతి మేడమ్.! ప్రబాస్ ఏంటీ సంగతి.!
- December 31, 2022
కృతి సనన్ పేరెత్తగానే డార్లింగ్ ప్రబాస్ మెలికలు తిరిగేస్తున్నాడు. సిగ్గుతో వయ్యారాలు పోతున్నాడు. కృతి మేడమ్ అంటూ ప్రత్యేకంగా సంబోధిస్తున్నాడు.
బాలయ్య హోస్ట్‌గా ఆహా ఓటీటీలో టెలికాస్ట్ అయిన ‘అన్‌స్టాపబుల్2’ టాక్ షోలో చోటు చేసుకుంది ఈ ఫన్నీ ముచ్చట. కృతి సనన్ని మేడమ్ అని సంబోధించడంతో, బాలయ్య ఏంటీ సంగతి డార్లింగ్.! అంటూ ప్రబాస్‌ని కూపీ లాగే ప్రయత్నం చేశారు.
కానీ, ఎక్కడా ఓపెన్ కాలేదు ప్రబాస్. మొన్నామధ్యన ‘భేడియా’ సినిమా ప్రమోషన్లలో కృతి సనన్ కూడా ప్రబాస్ గురించి చెప్పి ఇలాగే వయ్యారాలు పోయింది. అప్పుడే, కృతి సనన్, ప్రబాస్ డేటింగ్లో వున్నారంటూ వార్త బయటికి వచ్చింది.
అయితే, అదేం లేదు.. అని ఆ తర్వాత ఇద్దరూ కొట్టి పడేశారనుకోండి. మళ్లీ అన్‌స్టాపబుల్ వేదికగా, ప్రబాస్ తీరు చూస్తుంటే ఫ్యాన్స్‌కి ఎక్కడో తేడా కొడుతున్నట్లే వుంది మరి.
ప్రబాస్, కృతి సనన్ కలిసి ‘ఆది పురుష్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి రిలీజ్ కావల్సిన ఈ సినిమా జూన్‌లో రిలీజ్ అయ్యేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది.
తాజా వార్తలు
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్‌లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
- ఒమన్ రోడ్లపై స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..!!
- ఎయిర్ ఏషియా బహ్రెయిన్‌లో మిడిల్ ఈస్ట్ హబ్ ప్రారంభం..!!
- వన్డే ప్రపంచకప్ విజయం.. భారత మహిళల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వర్షం..
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కంకర లారీ ఢీ.. 19 మంది మృతి..
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!







