‘వాల్తేర్ వీరయ్య’: డోన్ట్ స్టాప్ డాన్సింగ్: పూనకాలూ లోడింగ్.!

- December 31, 2022 , by Maagulf
‘వాల్తేర్ వీరయ్య’: డోన్ట్ స్టాప్ డాన్సింగ్: పూనకాలూ లోడింగ్.!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ పై అంతకంతకూ అంచనాలు పెరిగిపోతున్నాయ్. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ‘డోన్ట్ స్టాప్ డాన్సింగ్ పూనకాలు లోడింగ్..’ లిరికల్ సాంగ్ వీడియోకి నిజంగానే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు.
ఈ పాటలో చిరంజీవి ఎనర్జీని ఫ్యాన్స్ కూడా తట్టుకోలేకపోతున్నారు. నో డౌట్ చిరంజీవికి వయసు ముప్పై ఏళ్లు తగ్గిపోయింది. ఆ ఏజ్ ఏంటీ.? ఆ గేజ్ ఏంటీ.? ఇదే ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట.
మాస్ రాజా రవితేజతో కలిసి మెగాస్టార్ వేస్తున్న మాస్ చిందులకు మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్. సంక్రాంతికి అసలు సిసలు పండగే ‘వాల్తేర్ వీరయ్య’ అని సినీ ప్రియులు ఫిక్సయిపోయారు.
జస్ట్ లిరికల్ సాంగ్‌కే ఇంత ఊపిస్తే, ఇక, ఈ సాగ్ ఫుల్ వీడియోకి ధియేటర్లు ఢమాలే.! జనవరి 13న ధియేటర్లలో ‘వాల్తేర్ వీరయ్య’ సందడి మొదలు కానుంది. శృతి హాసన్, క్యాథరిన్ హీరోయిన్లుగా నటించగా, బాలీవుడ్ అందగత్తె ఊర్వశి రౌతెలా ఐటెం సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com