గుంటూరు జిల్లా తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు
- January 02, 2023
అమరావతి: గుంటూరు జిల్లాలో తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు చేశారు. నల్లంపాడు పోలీసులు సెక్షన్ 174, సెక్షన్ 304 కింద రెండు కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమం నిర్వహకులపై కేసు నమోదు చేశారు. తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి.
నిన్న సాయంత్రం చంద్రబాబు ప్రసంగం ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ వెంటనే చంద్రన్న కానుల పంపిణీ మొదలైంది. కౌంటర్ల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. సభలో ఉన్న వారు కూడా కౌంటర్ల వద్దకు వెళ్లడంతో రద్దీ మరింత పెరిగింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రెండు కౌంటర్ల వద్ద తోపులాట జరిగింది. కొందరు క్యూలైన్లలో కాకుండా పంపిణీ చేస్తున్నవైపు దూసుకెళ్లడం, తొందరగా వెళ్లాలన్న తాపత్రయంతో గందగరోళం నెలకొంది.
అందరూ ఒక్కసారిగా ఒత్తిడి గురై బారీకేడ్ల పై పండటంతో అవి ఒరిగిపోయాయి. బయటికి వెళ్లాలన్న ఆత్రుతతో బారీ కేడ్ల కింద పడ్డవారిపై నుంచి వెళ్లడం ఘటనకు కారణమైంది. సుమారు 20 నిమిషాలపాటు అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







