మంత్రి కేటీఆర్ను కలిసిన డీజీపీ అంజనీకుమార్

- January 02, 2023 , by Maagulf
మంత్రి కేటీఆర్ను కలిసిన డీజీపీ అంజనీకుమార్

హైదరాబాద్: డీజీపీ అంజనీకుమార్ నేడు మంత్రి కేటీఆర్ ను కలిశారు. మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం కొత్త డీజీపీగా అంజనీకుమార్ కు బాధ్యతలు అప్పగించింది. మహేందర్ రెడ్డి నుండి బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్ మర్యాదపూర్వకంగా కేటీఆర్ ను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

1990 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అంజనీకుమార్ ఉమ్మడి రాష్ట్రంలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఐపీఎస్ శిక్షణ అనంతరం వరంగల్‌ జిల్లా జనగామ ఏఎస్పీగా తొలి పోస్టింగ్‌ పొందిన ఆయన ఆ తరువాత మహబూబ్‌నగర్‌, ప్రకాశం, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు. 1998లో ఐక్య రాజ్య సమితి శాంతిపరిరక్షక దళానికి ఎంపికై బోస్నియా-హెర్జిగోవినాలో సంవత్సరంపాటు విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన రెండుసార్లు ఐక్యరాజ్య సమితి శాంతి పతకాన్ని అందుకున్నారు. కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా, గ్రేహౌండ్స్‌ చీఫ్‌గా, నిజామాబాద్‌ రేంజ్‌ల డీఐజీగా, వరంగల్ ఐజీగా, హైదరాబాద్‌ ఏసీపీగా, సీపీగా, ఏసీబీ డీజీగా వివిధ హోదాల్లో అంజనీకుమార్ పని చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com