సౌదీ డాకర్ ర్యాలీ 2023: ప్రోలాగ్‌లో ఆడి అగ్రస్థానం

- January 02, 2023 , by Maagulf
సౌదీ డాకర్ ర్యాలీ 2023: ప్రోలాగ్‌లో ఆడి అగ్రస్థానం

సౌదీ: డకార్ ర్యాలీ క్క 45వ ఎడిషన్ న్యూ ఇయర్ సందర్భంగా ఎర్ర సముద్రం ఒడ్డున 13 కి.మీ సమయంతో కూడిన చిన్న రేసుతో ప్రారంభమైంది. టాప్ 10 ఫినిషర్‌లు వారి ప్రాధాన్య ప్రారంభ స్థానాలను ఎంచుకునే అవకాశాన్ని పొందారు. రెండుసార్లు DTM ఛాంపియన్ అయిన ఎక్స్‌స్ట్రామ్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆడి RS Q e-tron E2లో సరిగ్గా ఎనిమిది నిమిషాల్లో టైమ్డ్ లూప్‌ను పూర్తి చేశాడు. తొమ్మిది సార్లు WRC ఛాంపియన్ అయిన లోయెబ్ తన ప్రొడ్రైవ్-బిల్ట్ హంటర్‌లో రెండవ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. డాకర్ లెజెండ్ పీటర్‌హాన్సెల్ ఇద్దరు ఆడి డ్రైవర్‌లుగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ప్రీ-ర్యాలీ ఫేవరెట్ అల్-అత్తియా తన టయోటా హిలక్స్‌లో నాల్గవ స్థానంలో నిలిచారు. GCK మోటార్‌స్పోర్ట్ డ్రైవర్ గ్వెర్లిన్ చిచెరిట్ ఐదవ స్థానంలో.. సైన్జ్ తన ఆడిలో కేవలం 14 సెకన్ల దూరంతో ఆరో స్థానంలో నిలిచాడు. యజీద్ అల్-రాజి తన టయోటా కారుతో ఏడవ పొజిషన్ పొందారు. జాకుబ్ ప్రిజిగోన్స్కీ, ఓర్లాండో టెర్రానోవా అల్-రాజీ ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు. 2023 డకార్ ర్యాలీ సౌదీ అరేబియా ఎడారుల మీదుగా దాదాపు 7,500 కి.మీ వరకు రేసు సాగనున్నది. 2023 డాకర్ ర్యాలీలో గ్లోబల్ స్టార్‌లు పాల్గొంటున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com