ఓ కాలమా....
- January 03, 2023ఓ కాలమా కాసేపాగుమా...
నీ పరుగునీదే అన్నిటిని మరువమని
ఒడిదుడుకులు ఒత్తిడులు అధిగమించి
కన్న కలలు సాకారం చేసుకోమని
సంతోషసరాగాల కి దారిచూపుతు...
జీవితాన్ని మించిన గురువు
అనుభవాలు నేర్పిన పాఠంలేదని
ఎన్నోమధురక్షణాలు పరాజయాలు
తీపి ఙ్ఞాపకాలు చేదు గుళికలు
అపజయాలు బాధపెట్టిన
కనురెప్ప పాటులో గడచిన ఏడాది ....
ఓర్పు సహనం విశ్వాసమనే నమ్మకంతో
సరికొత్త లక్ష్యాలు ప్రణాళికల ధ్యేయంతో
ముందుకు సాగుతూ కాంతుల దారుల్లో
జీవనపయనం ఎలా సాగాలో నిబధ్ధతతో
దిశానిర్ధేశం చేసుకుంటూ కాలగతిలో.....
బతుకుపోరులో కొత్తదనానికి
తీయనిపిలుపుతో స్వాగతిస్తు
రాగద్వేషాలు విడనాడి కొత్త ఊసులు
ఊహలతో ఆశకన్న ఆశయమే ముఖ్యంగా
సంకల్పబలంతో వేద్దాం కొత్త అడుగు ....
శ్రమిస్తు ఏదైనా సాధించటమే కర్తవ్యంగా
భావిస్తు మంచిమార్గమందు సలక్షణంగా
సమాయత్తమవుతు సరికొత్త ఆనందాలకి
పలుకుదాము స్వాగతము.....
(యామిని కోళ్ళూరు,అబుధాభి)
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు