తమన్నా ఆ బాలీవుడ్ హీరోకి పడిపోయిందా.?
- January 03, 2023
ఈ మధ్య మిల్కీ బ్యూటీ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయ్. త్వరలోనే తమన్నా పెళ్లి చేసుకోబోతోందంటూ తెగ వార్తలు పుట్టుకొస్తున్నాయ్.
ఇంట్లో సంబంధాలు చూస్తున్నారనీ, పెళ్లిపై తమన్నా కూడా సుముఖంగానే వున్నట్లుగా ఆ వార్తల సారాంశం. అయితే, ఈ న్యూస్‌పై తమన్నా ఇంతవరకూ స్పందించలేదు కానీ, తాజాగా ఇంకో గాసిప్ పుట్టుకొచ్చింది తమన్నాపై.
బాలీవుడ్ యంగ్ హీరో విజయ్ వర్మతో తమన్నా రిలేషన్లో వుందనేది ఆ వార్త తాలూకు సారాంశం. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఆ న్యూస్‌కి మరింత బలం చేకూరినట్లు కనిపిస్తోంది.
తమన్నా, విజయ్ వర్మ చాలా క్లోజ్‌గా వున్న ఫోటోలు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బయటపడ్డాయ్. ఇవి అధికారిక సోషల్ అకౌంట్స్ ద్వారా బయటికి వచ్చిన పిక్స్ కాకపోయినా, నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయ్. విజయ్ వర్మను హగ్ చేసుకుంటూ, కిస్ చేస్తున్న ఫోటోలవి.
దీంతో, తమన్నాపై పుకార్లు నిజమేనా.! నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా. ఇదేనా ఆ నిప్పు.. అంటూ చెవులు కొరుక్కుంటున్నాయ్ సోషల్ కోళ్లు.
తాజా వార్తలు
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!







