మక్కా, మదీనా, అల్-బహా ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు

- January 04, 2023 , by Maagulf
మక్కా, మదీనా, అల్-బహా ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు

రియాద్ : మక్కా, మదీనా, అల్-బహా ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) హెచ్చరించింది. భారీ వర్షాలు, ఉపరితల గాలులు, ఎత్తైన అలలు, వడగళ్ళు , కుండపోత ప్రవాహంతో పాటు ఉరుములతో కూడిన తుఫాను కురుస్తుందని NCM హెచ్చరిక జారీ చేసింది. బుధవారం ఉదయం 10 గంటల వరకు దృశ్యమానత(లో విజన్) ఉంటుందని పేర్కొంది. మక్కా, జెద్దా, తైఫ్, అల్-కమిల్, అల్-లైత్, అల్-షాబియా, బహ్రా, అల్-జమూమ్, ఖులైస్, అస్ఫాన్, రబీగ్‌లతో సహా పలు గవర్నరేట్‌లలో వర్షాలు పడే అవకాశం ఉంది. పవిత్ర నగరం మదీనా, అల్-హంకియా, బద్ర్, ఖైబర్, యాన్బు, అల్-మహద్, వాడి అల్-ఫరా, అల్-బహా, అల్-అకిక్, అల్-ఖురా, బల్జురాషి, బనీ హసన్, అల్-మందాక్‌ లు వర్షాలతో ప్రభావితమయ్యే అవకావం ఉంది. వడగళ్లతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు తూర్పు ప్రాంతం (అల్-షార్కియా), ఉత్తర సరిహద్దులను కూడా తాకుతాయని NCM పేర్కొంది. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ నివేదికల ఆధారంగా అందరి భద్రతను నిర్ధారించడానికి జెడ్డాలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ జెడ్డా, రబీగ్, ఖులైస్ పాఠశాలల్లో వ్యక్తిగత తరగతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం తరగతులు విద్యార్థులందరికీ మద్రాసతి వేదిక ద్వారా రిమోట్‌గా నిర్వహించబడతాయి. పాఠశాల సిబ్బంది, విద్యా కార్యాలయాల్లోని సిబ్బంది రిమోట్‌గా పని చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com