విమానంలో వృద్ధురాలిపట్ల ప్రయాణికుడు అసభ్య ప్రవర్తన..

- January 04, 2023 , by Maagulf
విమానంలో వృద్ధురాలిపట్ల ప్రయాణికుడు అసభ్య ప్రవర్తన..

న్యూ ఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణీకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో 70ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ దారుణ ఘటనతో ఒక్కసారిగా కంగుతిన్న ఆమె సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. గత ఏడాది నవంబర్ 26న ఈ ఘటన చోటు చేసుకోగా.. ఎయిర్ ఇండియా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానం జెఎఫ్‌కే (యూఎస్) నుంచి ఢిల్లీకి వస్తుంది.

ఇదిలా ఉంటే.. ఈ ఘటనను వివరిస్తూ మహిళా వృద్ధురాలు.. టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌కు లేఖ రాయడంతో కేసు దర్యాప్తు కూడా ప్రారంభమైంది. అయితే, తనకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైన సమయంలో క్యాబిన్ సిబ్బంది చురుగ్గా వ్యవహచలేదని వృద్ధురాలు తన లేఖలో పేర్కొంది. సిబ్బంది నుంచి ప్రతిస్పందన పొందడానికి నేను చాలా సమయం వేచి చూడాల్సి వచ్చిందని లేఖలో ఫిర్యాదు చేసింది.

భోజనం తర్వాత లైట్లను డిమ్ చేసిన సమయంలో ఈఘటన జరిగింది. తనపై మూత్రం పోయడం వల్ల తన దుస్తులు, బ్యాగ్, షూ తడిసినట్లు ఆమె ఆరోపించింది. విమానంలో సిబ్బంది తనకు దుస్తులు, చప్పులను ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఫస్ట్ క్లాస్‌లో చాలా సీట్లు ఖాళీగా ఉన్నా..సిబ్బంది సీటులో ప్రయాణించాల్సి వచ్చిందని ఆమె వాపోయింది.ఈ విషయంపై ఎయిర్ ఇండియా అధికారి మాట్లాడుతూ..ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రయాణీకులను నో ప్లే లిస్ట్ లో ఉంచాలని సిఫార్సు చేసింది. ఈ విషయం ప్రభుత్వ కమిటీ కింద ఉందని, నిర్ణయం కోసం వేచి ఉందని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్ ఇండియా దృష్టి సారించాయి. విమానయాన సంస్థ నుంచి నివేదిక కోరుతున్నామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని డీజీసీఏ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com