రష్మికా.! ఇదో కొత్త పబ్లిసిటీనా.!
- January 04, 2023రష్మిక ఏం చేసినా తప్పయిపోతోంది ఈ మధ్య. మొన్న ‘కాంతార’ సినిమా ఇంకా చూడలేదన్నందుకు ఓ గొడవ. నిన్న విజయ్ దేవరకొండతో న్యూ ఇయర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ దొరికిపోయిందంటూ ఇంకో గొడవ.. అంతకు ముందు బోలెడన్ని కాంట్రవర్సీలు.
ఇలా రష్మిక మండన్నాని సోషల్ తెరపై నెటిజన్లు తగ్గేదేలే అన్నట్లుగా ఆటాడేసుకుంటున్నారు. ఆ ఆటకు చెక్ పెట్టాలనుకుందేమో రష్మిక తాజాగా మరో పోస్ట్ పెట్టింది.
ఈ సారి మరో స్టార్ హీరోయిన్ సమంతను తన పబ్లిసిటీకి వాడేసుకుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరహా అనారోగ్యంతో బాధపడుతున్న సమంతను తాను అమ్మలా చూసుకుంటానని పోస్ట్ పెట్టింది రష్మిక.
సమంత అంటే తనకెంతో ఇష్టమనీ, తనకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని రష్మిక చెప్పింది. సమంత చాలా స్ర్టాంగ్ లేడీ అని, ఆమె ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని ఆ దేవున్ని ప్రార్ధిస్తుంటా.. అని రష్మిక చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మరోవైపు సమంత అనారోగ్యాన్ని రష్మిక ఇలా వాడేసుకుంటోందన్న మాట.! అని రష్మిక హ్యాటర్స్ అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







