‘వీరయ్య’ వెర్సస్ ‘వీర సింహం’: మనోభావాల ‘మైత్రి’ చెడిపోకుండా.!
- January 04, 2023
ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోరుకు దిగుతున్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో దిగడం కొత్తేమీ కాకపోయినా, ఈ సారి రేస్ మాత్రం చాలా చాలా ప్రత్యేకమైనది.
రెండు సినిమాలూ ఖచ్చితంగా హిట్ అవ్వాలి. బాక్సాఫీస్ కళకళలాడాలి. ఎందుకంటే, సినిమాకి గడ్డు కాలం నడుస్తున్న రోజులివి. సినీ ఇండస్ర్టీ ఆ గడ్డు సమస్య నుంచి కోలుకోవాలంటే, ఇలాంటి రెండు పెద్ద సినిమాలూ.. ఇవే కాదు, సంక్రాంతికి రాబోతున్న ఎన్ని సినిమాలైతే అన్ని సినిమాలూ హిట్ అవ్వాలి.
మంచి వసూళ్లు రాబట్టాలి. ఇక, ‘వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాల విషయానికి వస్తే, ఈ రెండు సినిమాల నిర్మాతలూ, హీరోయిన్, ఇతర టెక్నీషియన్లూ చాలా వరకూ కలిసి పని చేశారు.
అందుకే ఎవరి మనోభావాలూ దెబ్బ తినకుండా రెండు సినిమాలనూ ఈక్వెల్‌గా ప్రమోట్ చేస్తున్నారు. మైత్రీ మూవీస్ మేకర్స్ ఈ రెండు సినిమాల్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. ప్రమోషన్ల విషయంలో ఎలాంటి పక్షపాతం వహించకుండా స్నేహపూర్వకంగా మెలగుతున్నారు. పక్కా ప్లానింగ్‌తో ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలో త్వరలో జరగబోయే ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అత్యంత కీలకంగా మారాయి. ఈ నెల 6 వ తేదీన జరగబోయే ‘వీరసింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఒంగోలు వేదిక కానుంది. ‘వాల్తేర్ వీరయ్య’ ఇంకా డేట్ ఫిక్స్ చేసుకోలేదు. ఇంతవరకూ జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వచ్చిన ఈ ‘మైత్రి’ రిలీజ్ వరకూ కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుందాం.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







