‘అమిగోస్’ నుంచి ‘డోపిల్ గ్యాంగర్ 2’ వచ్చేశాడహో.!

- January 04, 2023 , by Maagulf
‘అమిగోస్’ నుంచి ‘డోపిల్ గ్యాంగర్ 2’ వచ్చేశాడహో.!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అమిగోస్’. టైటిల్‌తోనే ఎక్కడా లేని ఆసక్తి రేకెత్తించిన కళ్యాణ్ రామ్, ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ అంశంతోనూ విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాడు.
మనిషిని పోలిన మనిషి అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా కథ వుండబోతోందని ఇప్పటికే హింట్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. అందులో భాగంగానే ‘డోపిల్ గ్యాంగర్ 1 సిద్దార్ధ్’ అంటూ తన పాత్రను పరిచయం చేశాడు. అలాగే తనలాంటి ఇంకో వ్యక్తి వున్నాడనీ త్వరలోనే ఆ వ్యక్తి క్యారెక్టర్ రివీల్ అవుతుందని కొన్ని రోజుల క్రితం ప్రకటించిన కళ్యాణ్ రామ్, లేటెస్ట్‌గా ఆ రెండో వ్యక్తి పాత్రను పరిచయం చేశాడు.
‘డోపిల్ గ్యాంగర్ 2 మంజునాధ్’ అంటూ, ఆ రెండో వ్యక్తి పాత్రను పరిచయం చేశాడు. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. ‘ఇంకొకడున్నాడు’ అని. మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురుంటారు.. అని మన పెద్దలు చెబుతుంటారు. బహుశా అదే కాన్సెప్ట్‌తో ‘అమిగోస్’ రూపు దిద్దుకుంటోంది కాబోలు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు కాదు. ఏకంగా ఏడుగురూ వుంటారేమో. ఇంట్రెస్టింగ్ కదా.! లెట్స్ వెయిట్ అండ్ సీ.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com