ఇంటికి పోవాలనే ఉద్దేశ్యంతో అబద్ధపు వీడియో పెట్టిన గల్ఫ్ కార్మికుడు..

- January 05, 2023 , by Maagulf
ఇంటికి పోవాలనే ఉద్దేశ్యంతో అబద్ధపు వీడియో పెట్టిన గల్ఫ్ కార్మికుడు..

దుబాయ్: గత రెండు మూడు రోజులుగా గల్ఫ్ బాధితుడిగా ఇమ్రాన్ షేక్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్  అవుతున్నది.'‘తనకు అన్నం లేదని కంపెనీ సరిగా చూసుకోవడం లేదని కేటీఆర్ తనను ఇండియా రప్పించి ఆదుకోవాలని’’ ఆ వీడియోలో ఇమ్రాన్ కోరాడు.రాజన్న సిరిసిల్ల వాసి అయిన అతని వీడియోపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం స్పందించారు. ఇండియాకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. ఇమ్రాన్ షేక్ మరో వీడియో చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అందులో తన మొదటి వీడియోలో చెప్పినవన్ని అబద్ధాలని పేర్కొన్నాడు.తన ఆరోపణల్లో నిజం లేదని తెలిపాడు.దుబాయ్ లో పనిచేయడం తనకు ఇష్టం లేకనే ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి అని సోషల్ మీడియాలో వీడియో పెడితే తొందరగా ఇంటికి పంపిస్తారనే ఉద్దేశంతో తాను వీడియోను పెట్టినట్లు చెప్పుకొచ్చాడు.

తాను సిరిసిల్ల వాసి అయిన బల్యాల సాయికుమార్ అనే వ్యక్తినీ గత సంవత్సరం నుంచి బతిలాడితే వారి కంపెనీ నుంచి ఫ్రీ వీసా పంపించాడని చెప్పాడు. తన దగ్గర సాయి గాని కంపెనీ గాని విసా కోసం ఒక్క రూపాయి తీసుకోలేదని, తాను ఇండియా నుండి దుబాయ్ వచ్చేటప్పుడే రెండు సంవత్సరాలు ఏ పని అయినా చేయాలని సాయి తనకు చెప్పాడని..దానికి తాను అంగీకరించే దుబాయ్ వచ్చినట్లు ఇమ్రాన్ తన రెండో వీడియోలో వివరించాడు. 

తీరా దుబాయ్ వచ్చాక తనకు పని చేతకాక ఇంటికి వెళ్లాలని ఉద్దేశంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టానని ఇమ్రాన్ తెలిపాడు. ఆ తర్వాత తనకు వీసా ఇచ్చిన సాయి సోషల్ మీడియాలో వీడియో చూసి ఎందుకలా పెట్టావు అని అడిగాడని, ఇక్కడ పనిచేయడం అవడం లేదు ఇంటికి వెళ్లాలి అని సాయితో చెప్పినట్లు తెలిపాడు. తరువాత సాయి నమ్మి అవకాశం ఇచ్చిన వారిని ఎప్పుడు మోసం చేయకూడదు అని చెప్తే ఎవరి బలవంతం లేకుండానే మరో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టినట్లు ఇమ్రాన్ చెప్పాడు.

ఆ వీడియోలో తనను ఎవరు బెదిరించలేదని, తానే తప్పు తెలుసుకొని వీడియో తీసి పెట్టానన్నారు.తన వీసా కి అయిన ఖర్చు మొత్తం దాదాపు 130,000 రూపాయలు అయిందని, అయినా కంపెనీ మానవత్వంతో తన దగ్గర రూపాయి తీసుకోకుండా తన వీసా క్యాన్సిల్ చేసి టికెట్ కూడా బుక్ చేసి ఇంటికి పంపిస్తున్నారని ఇమ్రాన్ తన రెండో వీడియోలో చెప్పుకొచ్చాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com