గెయిల్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు...
- January 05, 2023
భారత ప్రభుత్వ పెట్రోలియం, న్యాచులర్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని గెయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 277 చీఫ్ మేనేజర్, సీనియర్ ఇంజినీర్, సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, సెక్యూరిటీ, ఫైర్ అండ్ సేఫ్టీ, మెకానికల్, రెన్యూవెబుల్ ఎనర్జీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ/గ్రాడ్యుయేషన్/బీఈ/ బీటెక్/ఎంబీఏ/సీఏ/సీఎంఏ/మాస్టర్స్ డిగ్రీ/పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 28 నుంచి 45 యేళ్ల మధ్య ఉండాలి.
షార్ట్‌లిస్టింగ్, స్క్రీనింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.2,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 2, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.gailonline.com/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







