ఒమన్‌లో బయటపడ్డ 5 వేల సంవత్సరాల పురాతన నగరం
- January 05, 2023
ఒమన్: ఒమన్‌లోని అల్ ముదైబిలోని విలాయత్‌లోని అల్ ఘర్యేన్ పురావస్తు ప్రదేశంలో పురాతన తవ్వకాల రెండవ సీజన్‌లో అన్వేషణాత్మక బృందం 5,000 సంవత్సరాల నాటి నగరాన్ని వెలికితీసింది. సుల్తాన్ ఖబూస్ విశ్వవిద్యాలయం (SQU), వారసత్వం, పర్యాటక మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా తవ్వకాలు నిర్వహిస్తున్నాయి. తవ్వకాల బృందానికి SQU ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాసర్ సైద్ అల్ జహ్వారీ నేతృత్వం వహిస్తున్నారు. కొత్తగా గుర్తించిన నగరంలో ప్రణాళికబద్ధమైన నగర నిర్మాణంతోపాటు ఒక టవర్ ఉంది. అలాగే బహుళ-గది నివాసాలు, సామూహిక ఖనన సమాధులు ఉన్నాయి. 600-చ.మీ విస్తీర్ణంలో నిర్మించిన పెద్ద భవనాలను కూడా కొత్త సైట్ లో గుర్తించారు. వ్యవసాయం, పశువుల పెంపకం, రాగి కరిగించడం, వాణిజ్య మార్పిడి, ముఖ్యంగా తీరప్రాంత సమాజాలు, సింధ్ ప్రంతాల మధ్య సంబంధాలను గుర్తించినట్లు తవ్వకాల్లో పాల్గొన్న పురాతత్వ నిపుణులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







