జూన్ 30 లోపు ఇన్స్యూరెన్స్ కవర్ పొందాలి
- April 28, 2016
దుబాయ్ హెల్త్ అథారిటీ, దుబాయ్ వాసులు హెల్త్ ఇన్స్యూరెన్స్ కవర్ని జూన్ 30 లోపు పొందాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల్ని ధిక్కరించినవారికి గడువు ముగిశాక జరీమానా విధించబడుతుంది. వీసా రెన్యువల్ సందర్భంగా ఇన్స్యూరెన్స్ లేనిపక్షంలో భారీ జరీమానాను ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. డిపెండెంట్స్ సైతం ఇన్స్యూరెన్స్ కవర్ పొందవలసి ఉంటుంది. లేని పక్షంలో లీగల్‌గా అనేక ఇబ్బందులు తప్పవని అధికారులు హెచ్చరించారు. దుబాయ్‌లో ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్స్యూరెన్స్ తప్పనిసరి అనే నిబంధన అమల్లో ఉంది. 12,000 దిర్హామ్‌ల నుంచి 30,000 దిర్హామ్‌ల వరకు అత్యధిక ప్రీమియంతో ఇన్సూరెన్స్ ప్యాకేజీలున్నాయి. ఈ కారణంగా కొందరు ఆర్థిక భారం భరించలేక ఇన్స్యూరెన్స్ రెన్యువల్‌కి వెనుకంజ వేస్తుండడం జరుగుతుంది. హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి సంబంధించి డిహెచ్ఏ స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. ఏవైనా ఇబ్బందులు ఎదురైన పక్షంలో బాధితులు ఫిర్యాదు చేయడానికీ అవకాశాల్ని కల్పించారు. అంకాలజీ సహా పలు ముఖ్యమైన విభాగాల్లో ఇన్స్యూరెన్స్ సేవలపై అధికారులు పూర్తిస్థాయిలో నిఘా ఉంచుతున్నారు. మిడిల్ ఈస్ట్‌లో అంకాలజీకి సంబంధించి కాంప్రహెన్సివ్ రెగ్యులేషన్స్ దుబాయ్‌లోనే అందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దబడ్డాయి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







