దుబాయ్ టూరిస్ట్ వీసా: ఓవర్ స్టేకి Dh300 వరకు జరిమానా

- January 06, 2023 , by Maagulf
దుబాయ్ టూరిస్ట్ వీసా: ఓవర్ స్టేకి Dh300 వరకు జరిమానా

దుబాయ్: విజిట్ వీసాతో దుబాయ్ లో అడుగుపెట్టిన వారు వీసా గడువు ముగిసిన తర్వాత ఎన్ని అదనపు రోజులుంటే ఆ కాలానికి జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. దుబాయ్ నుంచి తిరిగి వెళ్లేందుకు ల్యాండ్ సరిహద్దులు, విమానాశ్రయాలు లేదా ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో అవుట్ పాస్ లేదా లీవ్ పర్మిట్ పొందవలసి ఉంటుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) దుబాయ్‌లోని కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ ఒకరు తెలిపారు. దేశంలో ఎక్కువ కాలం ఉంటున్న ఎవరైనా అవుట్‌పాస్ లేదా లీవ్ పర్మిట్ పొందాలని ఆయన ధృవీకరించారు. ఈ అనుమతిని అల్ అవీర్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో కూడా పొందవచ్చన్నారు. వీసా గడువు కంటే ఎక్కువ కాలం దుబాయ్ లో గడిపిన సందర్శకుడు దేశంలో వీసా గడువును పొడిగించిన రోజులకు కూడా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ట్రావెల్ పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రక్రియ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైంది. దేశంలో ఎక్కువ కాలం గడిపిన వారు చాలామంది దుబాయ్ వీడేముందు Dh200 నుండి Dh300 వరకు జరిమానాలు చెల్లించి లీవ్ పర్మిట్ పొందారని తెలిపారు.

గలదరి ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్వీసెస్‌లో MICE & హాలిడేస్ మేనేజర్ మీర్ వాసిం రాజా మాట్లాడుతూ.. వీసా గడువు ముగిసిన తర్వాత లేదా ఎమిరేట్స్ అందించే గ్రేస్ పీరియడ్ తర్వాత దేశంలో నివసించే సందర్శకులకు అవుట్‌పాస్ లేదా లీవ్ పర్మిట్ అవసరమన్నారు. ట్రావెల్ ఇండస్ట్రీ నిపుణుడి ప్రకారం, దుబాయ్ విజిట్ వీసా హోల్డర్‌లకు వీసా గడువు ముగిసిన తేదీ నుండి 10 రోజుల గ్రేస్ పీరియడ్ లభిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com