ఇద్దరిని రక్షించిన బహ్రెయిన్ కోస్ట్ గార్డ్
- January 06, 2023
బహ్రెయిన్: నిన్న తెల్లవారుజామున చేపలు పట్టేందుకు వెళ్లి సముద్రంలో తప్పిపోయిన ఇద్దరు నావికులను మెరైన్ పెట్రోలింగ్ అధికారులు రక్షించారు. కోస్ట్ గార్డ్ కమాండ్ ప్రకారం, ఇద్దరు వ్యక్తులు కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో తమ బోట్ పై నియంత్రణ కోల్పోయారు. ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ పరికరాన్ని ఉపయోగించి తప్పిపోయిన నివేదికను స్వీకరించిన గంటన్నరలోపు బుదయ్య ప్రాంతంలోని తీరం నుండి తప్పిపోయిన పడవను ఫష్త్ అల్-జరీమ్ ప్రాంతానికి పశ్చిమాన గుర్తించినట్లు కోస్ట్ గార్డ్ వర్గాలు తెలిపాయి. సముద్ర ప్రయాణీకులందరూ వాతావరణ డేటాను అనుసరించాలని, నౌకాయానానికి ముందు కోస్ట్ గార్డ్ కమాండ్‌కు తెలియజేయాలని పిలుపునిచ్చింది. పడవలు, ఫిషింగ్ ఓడలలో భద్రత, భద్రతా పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని, సముద్రంలో ప్రయాణించేటప్పుడు ఆటోమేటిక్ గుర్తింపు పరికరాలను ఆపరేట్ చేయాలని కోస్ట్ గార్డ్ కమాండ్ పిలుపునిచ్చింది. అత్యవసర సహాయం కోసం 17700000 లేదా హాట్‌లైన్ 994కు కాల్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్‌లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత









