హీరో విజయ్ ఎలాంటోడంటే-నటుడు శ్రీకాంత్.!
- January 07, 2023
హీరోగా తనకంటూ ప్రత్యేకమైన స్థానం దక్కించుకున్న నటుడు శ్రీకాంత్, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణిస్తున్నాడు. ‘రేసుగుర్రం’ సినిమాలో అల్లు అర్జున్‌కి బాబాయ్‌గా కీలక పాత్ర పోషించాడు.
ఇప్పుడు ‘వారసుడు’ కోసం విజయ్‌కి అన్నగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో శ్రీకాంత్ తొలిసారి తమిళంలో అడుగుపెడుతున్నాడు. విజయ్‌తో నటించడం తనకెంతో సంతోషంగా వుందని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు.
స్టార్ హీరో అయినా విజయ్ చాలా సింపుల్‌గా వుంటాడనీ, కామ్ గోయింగ్ పర్సన్ అనీ చెప్పాడు. అలాగే, అస్సలు క్యారవాన్ వినియోగించడట విజయ్. సెల్ ఫోన్ కూడా చాలా తక్కువ వాడుతుంటాడట. విజయ్‌లాంటి నటుడి సినిమాతో తమిళంలోకి అడుగు పెట్టడం అనేది ఓ మంచి అనుభూతి.. ఈ సినిమా తమిళంలో నాకు మంచి డెబ్యూ అవుతుంది.. అని శ్రీకాంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







