రకుల్ కొత్త సినిమా ట్రైలర్.! కూసింత కాంట్రవర్సీగా వుంది సుమా.!

- January 07, 2023 , by Maagulf
రకుల్ కొత్త సినిమా ట్రైలర్.! కూసింత కాంట్రవర్సీగా వుంది సుమా.!

తెలుగులో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్‌లో హవా చూపిస్తోంది. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నార్త్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది రకుల్.
కొన్ని నెలల గ్యాప్‌లోనే రకుల్ నుంచి వరుస ప్రాజెక్టులు రిలీజయ్యాయ్ ఈ మధ్య. అందులో ‘థాంక్ గాడ్’, ‘డాక్టర్ జి’ సినిమాలు రీసెంట్‌గా రిలీజై, ప్రేక్షకుల్ని అలరించాయ్. ఓటీటీలోనూ ఓకే అనిపించుకుంటున్నాయ్ ప్రస్తుతం ఈ సినిమాలు. 
త్వరలో ‘ఛత్రివాలి’ సినిమాతో రకుల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమాని జనవరి 20న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఒకింత కాంట్రవర్షియల్‌గా అనిపిస్తోంది. స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి రకుల్ మాట్లాడింది. 
స్కూల్ డేస్ నుంచే శృంగారం పట్ల అవగాహన గురించి తెలియచెప్పాల్సిన ఆవశ్యకత వుందని ట్రైలర్‌లో రకుల్ చెబుతోంది. సో, కండోమ్ వాడకం గురించిన ఆవశ్యకతను కూడా ఈ సినిమాలో చూపించారు. మొత్తానికి ట్రైలర్ ఒకింత ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తోంది. అభ్యంతరకర సన్నివేశాలు కూడా చూపించారు. చూడాలి మరి, డైరెక్ట్‌గా ఓటీటీలో రాబోతున్న ‘ఛత్రివాలి’ రకుల్‌కి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com