శ్రీలంకకు భారత్ సాయం..
- January 08, 2023
కొలంబో: శ్రీలంకలో రవాణా వ్యవస్థని మెరుగుపర్చే ఉద్దేశంతో ఈ పని చేసింది. శ్రీలంకలో భారత రాయబారి వీటిని అక్కడి అధికారులకు అందజేశారు. మొత్తం 500 బస్సుల్ని అందజేయాలని భారత్ నిర్ణయించింది. మిగతా బస్సుల్ని కూడా దశలవారీగా అందిస్తారు. గత మేలో తమ దేశం దివాళా తీసినట్లు శ్రీలంక ప్రకటించింది. అప్పట్నుంచి ఇండియా అనేక రకాలుగా శ్రీలంకకు సాయం చేస్తోంది. ‘నేబర్హుడ్ ఫస్ట్ (పొరుగు దేశాలకే మొదటి ప్రాధాన్యం)’ అనే విధానం కింద శ్రీలంకకు ఇండియా సాయం చేస్తోంది. శ్రీలంక పోలీసులకు గత డిసెంబర్లో 125 ఎస్‌యూవీలు అందజేసింది. అక్కడ సరైన వాహనాలు లేకపోవడంతో పోలీసులు పని చేయడం కూడా కష్టమవుతోంది. అందుకే ఇండియా వీటిని అందజేసింది.
అంతకుముందు 4 బిలియన్ అమెరికన్ డాలర్ల సాయం ప్రకటించింది. తర్వాత 900 మిలియన్ డాలర్ల రుణం అందజేసింది. శ్రీలంక దగ్గర చమురు కొనేందుకు కూడా డబ్బులు లేవు. దీంతో శ్రీలంక చమురు కొనేందుకు 500 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. తర్వాత దీన్ని 700 అమెరికన్ డాలర్లకు పెంచింది. భారత్ అందించిన సాయాన్ని అత్యవసర వస్తువులు, చమురు కొనేందుకు వినియోగించుకుంటోంది శ్రీలంక. ఇప్పుడిప్పుడే శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ దేశాలు శ్రీలంకకు ఆర్థిక సాయం అందజేస్తున్నాయి.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







