దటీజ్ చిరంజీవి.! ‘వీర సింహారెడ్డి’ విజయం కోరుకున్న మెగాస్టార్.!
- January 09, 2023
ఇండస్ట్రీ పెద్ద అంటే ఒప్పుకోరు కానీ, ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ పెద్దరికంగానే వ్యవహరిస్తుంటారాయన. అందుకే ఆయన తెలుగు ఇండస్ట్రీకి పెద్దన్యయ్య. ఎవరు అవునన్నా కాదన్నా, ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఆయనే.
ఆయనే మెగాస్టార్ చిరంజీవి. ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేర్ వీరయ్య’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా విజయంపై ఆయన పూర్తి నమ్మకంగా వున్నారు.
ఎందుకంటే, చిరంజీవితో సినిమా అన్నట్లుగా కాకుండా, ఈ సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరూ తమ అభిమాన హీరో సినిమా చేస్తున్నాం అన్నట్లుగా కష్టపడ్డారు. వారి కష్టం అంతా తెరపై ఖచ్చితంగా కనిపిస్తుందని చిరంజీవి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఇదే సంక్రాంతికి తన సినిమానే కాకుండా, తోటి హీరో బాలయ్య నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘వీర సింహారెడ్డి’ సినిమా మంచి విజయం సాధించాలని ‘వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడారు. అలాగే, చిన్న సినిమా ‘కళ్యాణం కమనీయం’ గురించి కూడా ఆయన మాట్లాడారు. చిరంజీవి ఎప్పుడూ ఇంతే. ఏ చిన్న విషయాన్నీ లైట్‌గా తీసుకోరు. అందుకే ఆయన మెగాస్టార్.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







