11 కిలోల బంగారం గెలుచుకున్న 44 మంది విజేతలు
- January 10, 2023
యూఏఈ: దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా 44 మంది 11 కిలోల బంగారాన్ని గెలుచుకున్నారు. దుబాయ్ జ్యువెలరీ గ్రూప్ ప్రకారం, ఇప్పటివరకు 44 మంది విజేతలుగా నిలిచారు. ఒక్కొక్కరు పావు కిలో బంగారం గెలుచుకున్నారు. 245 భాగస్వామ్య అవుట్లెట్లలో షాపింగ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. జనవరి 29, 2023 వరకు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ జరుగనున్నది. ఈ సందర్భంగా ఒక్కొక్కరు పావు కిలో బంగారాన్ని గెలుచుకోవడానికి Dh500 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో ఆభరణాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు విజేతలలో ఎక్కువ మంది భారతీయులు(27మంది) ఉండగా.. ఆ తర్వాత స్థానంలో పాకిస్థానీలు, బంగ్లాదేశ్, యూఏఈ జాతీయులున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







