సీఎస్ సోమేష్ కుమార్ కు బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్టు
- January 10, 2023
హైదరాబాద్: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు బిగ్ షాక్ ఇచ్చింది హైకోర్టు. రాష్ట్రంలో సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది. అలాగే సోమేశ్ కుమార్ సొంత రాష్ట్రమైన ఏపీకి వెళ్లాలని హైకోర్టు సూచించింది. గతంలో క్యాబ్ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. న్యాయవాది అభ్యర్ధనతో కోర్టు తీర్పు 3 వారాల పాటు నిలిపివేశారు. దీనిపై సీఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించింది కేంద్రం. అయితే, కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఇప్పుడు సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది.సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేస్తూ ..ఏపికి వెళ్లాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







