సికింద్రాబాద్-విశాఖపట్నంకి వందేభారత్ ఎక్స్‌ప్రెస్..

- January 10, 2023 , by Maagulf
సికింద్రాబాద్-విశాఖపట్నంకి వందేభారత్ ఎక్స్‌ప్రెస్..

న్యూ ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ పట్టాలెక్కేందుకు సర్వం సిద్దమవుతోంది. సికింద్రాబాద్–విశాఖపట్నం– సికింద్రాబాద్ మధ్య ఈ ట్రైన్ పరుగులు పెట్టనుంది.ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ జనవరి 19న ప్రారంభించనున్నారు.వాస్తవానికి ఈ ట్రైన్‌ను మొదటగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకే అనుకున్నారు. అయితే.. ట్రాక్ అప్‌గ్రేడేషన్ పనులు విజయవాడ-విశాఖపట్నం మధ్య పూర్తి కావడమే కాదు.. పలువురు నేతలు విశాఖపట్నం వరకు వందేభారత్ ట్రైన్‌ను పొడిగించాలని విజ్ఞప్తులు చేయగా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా విశాఖ వరకు పొడిగించింది.

ఇదిలా ఉంటే ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది. ఆయా స్టేషన్లలో మాత్రమే ఈ ట్రైన్ అగనుంది. ఈ వందే‌భారత్ రైలు గరిష్టంగా 180 కిమీ వేగంతో ప్రయాణించే సామర్ధ్యం కలిగి ఉంది. అంతేకాకుండా ఈ వందేభారత్ ట్రైన్.. ప్రస్తుతం నడుస్తోన్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ తరహాలో నడవనున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి ప్రయాణికులు గతంలో పన్నెండు నుండి పద్నాలుగు గంటలతో పోలిస్తే ఇప్పుడు ఎనిమిది గంటల్లోనే విశాఖపట్నం చేరుకోవచ్చు. ఈ రైలులో 16 కోచ్‌లు ఉండగా, మొత్తం 1128 సీట్లు ఉంటాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com