ప్యాన్ వరల్డ్ సినిమాగా తేజ సజ్జా ‘హనుమాన్’ మూవీ.!

- January 10, 2023 , by Maagulf
ప్యాన్ వరల్డ్ సినిమాగా తేజ సజ్జా ‘హనుమాన్’ మూవీ.!

బుడ్డోడు తేజ సజ్జా హీరోగా ‘జాంబిరెడ్డి’ సినిమాతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించాడు. తాజాగా ‘హనుమ్యాన్’ అనే ఓ ఫాంటసీ సినిమాలో తేజ సజ్జా నటిస్తున్నాడు.
‘కల్కి’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ మూవీగా రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ తదితర భాషలతో పాటూ, స్పానిష్, ఇంగ్లీష్ తదితర భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమాని రిలీజ్ చేస్తుండడంతో ప్యాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాని అభివర్ణిస్తున్నారు. సూపర్ హీరోగా ఈ సినిమాలో తేజ సజ్జా కనిపిస్తున్నాడు. మొన్నా మధ్య రిలీజైన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయన్న బజ్ వచ్చింది. మే 14న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నామంటూ తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. అమృతా అయ్యర్ ఈ సినిమాలో తేజ సజ్జాకి జోడీగా నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com