‘శాకుంతలం’ సమంత కెరీర్‌కి ఎంత వరకూ యూజ్ అవుతుందో.!

- January 10, 2023 , by Maagulf
‘శాకుంతలం’ సమంత కెరీర్‌కి ఎంత వరకూ యూజ్ అవుతుందో.!

గుణ శేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ‘శాకుంతలం’. సమంత లీడ్ రోల్ పోషిస్తోంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో మేల్ లీడ్ పాత్ర పోషిస్తున్నాడు. ఫిబ్రవరి 17న సినిమా రిలీజ్ వుండడంతో, ప్రమోషన్లు షురూ చేసింది గుణ్ శేఖర్ అండ్ టీమ్.
అందులో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి సమంత కూడా హాజరైంది. చాలా కాలం తర్వాత సమంతను మీడియా ముఖంగా చూసిన అభిమానులు ఖుషీ అయ్యారు. మరోవైపు సమంత కూడా చాలా ఎమోషనల్ అయ్యింది. మయోసైటిస్ వ్యాధి బారిన పడి, ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న సమంత, ఈ సినిమా ప్రమోషన్ల కోసమే విదేశాల నుంచి తిరిగొచ్చింది. 
కాగా, ‘శాకుంతలం’ విషయానికి వస్తే, ఎప్పటిలాగే సమంత తనదైన నటన కనబరిచినట్లు ట్రైలర్‌ చూస్తే అర్ధమవుతోంది. శకుంతలగా సమంత తన నటనతో కట్టిపడేసేలానే వుంది. తెలుగమ్మాయ్ అనన్య నాగళ్ల సమంతకు చెలికత్తెగా నటిస్తోంది. సీనియర్ నటుడు మోహన్ బాబు దుర్వాస మహర్షి పాత్రలో కనిపించనున్నారు. 
గుణ శేఖర్ తనదైన టేకింగ్ విజువల్ ఎఫెక్ట్ట్స్‌తో ‘శాకుంతలం’ ట్రైలర్‌ని బాగానే కట్ చేశారు. మరి, సినిమా ఎలా వుండబోతోందో ఫైనల్ రిజల్ట్ తెలియాలంటే ఫిబ్రవరి 17 వరకూ ఆగాల్సిందే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com