‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్: జక్కన్న కన్‌ఫామ్ చేసినట్లా.? కాదా.?
- January 10, 2023
‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ఎలాగైనా ఆస్కార్ బరిలో నిలపాలని జక్కన్న అండ్ టీమ్ శత విధాలా కష్టపడుతోన్న సంగతి తెలిసిందే. ‘నాటు నాటు..’ సాంగ్ ద్వారా ఎలాగోలా ఆస్కార్ రేస్‌లో అడుగు పెట్టింది ‘ఆర్ఆర్ఆర్’.
ఈ సందర్భంగా అమెరికాలోనే వుంటూ అక్కడ రకరకాల ఈవెంట్స్‌లో జక్కన్న పాల్గొంటున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, మేకర్లు పొగడ్తలతో ముంచుత్తుతున్నారు.
అంతేకాదు, ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తే బావుండు.. అని తమ తమ అభిప్రాయాల్ని వ్యక్త పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా స్క్రిప్ట్ లాక్ అయ్యింది కానీ, తాళం నా దగ్గర లేదు.. అంటూ తనదైన శైలిలో ఓ హింట్ ఇచ్చారు జక్కన్న.
ఆ మాటకు అర్ధమేంటీ.? ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ కోసం ఆల్రెడీ జక్కన్న ప్రయత్నాలు మొదలెట్టేశాడా.? అని భావిస్తున్నారు. ఈ సినిమాకి సీక్వెల్ వుండదు.. అని గతంలో రాజమౌళి చెప్పారు. కానీ, ఇప్పుడు పెరిగిన ఒత్తిడి కారణంగా జక్కన్న తన ఆలోచన మార్చుకున్నాడో ఏమో.! మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’కి సీక్వెల్ వస్తే, అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలు మరోసారి కీర్తించుకోవచ్చుగా.!
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







