జమ్మూ కశ్మీర్ లో విషాదకర ఘటన..ముగ్గురు సైనికులు మృతి
- January 11, 2023
జమ్మూ కశ్మీర్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధుల్లో భాగంగా గస్తీ కాస్తున్న ముగ్గురు సైనికులు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయారు.దీంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. నార్త్ కశ్మీర్ లోని కుప్వారాలో 14వ బెటాలియన్ కు చెందిన ఒక అధికారి, ఇద్దరు జవాన్లు మృతి చెందారు.
ఫార్వార్డ్ ఏరియాలో ఈ ముగ్గురూ విధులు నిర్వహిస్తుండగా మంచు పెళ్లలు విరిగిపడడంతో ..పట్టుతప్పి వాళ్లు ముగ్గురూ లోయలో పడిపోయారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం లోయలో పడిన సైనికుల కోసం గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలు దొరికాయని చీనార్ కోర్ కు చెందిన అధికారులు వివరించారు. కాగా, ఈ ప్రమాదంలో చనిపోయిన సైనికులు, అధికారి ఎవరనే వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







