నాటు నాటు సాంగ్ కు ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు రావడం పట్ల మెగాస్టార్ ఫుల్ హ్యాపీ
- January 11, 2023
అమెరికా: ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు రావడం పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. బాహుబలి సిరీస్ తో తెలుగు సినిమా సత్తా చాటిన డైరెక్టర్ రాజమౌళి..ఆర్ఆర్ఆర్ తో మరో స్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్, అజయ్ దేవగన్ , శ్రీయ మొదలగు నటి నటులు నటించిన ఈ మూవీ పాన్ ఇండియా గా విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం ఆస్కార్ రేసులో ఉంది. ఈ క్రమంలో సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు లభించింది.
కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో బుధవారం రాజమౌళి, ఎన్టీఆర్, కీరవాణి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ‘నాటు నాటు’ పాటకు పురస్కారం ప్రకటించిన వెంటనే వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అందరూ చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు రావడం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు యావత్ ఇండియన్ సినిమా సంబురాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇదొక చారిత్రక విజయమంటూ.. దీనిపట్ల దేశం గర్విస్తోందన్నారు. సంగీత దర్శకుడు కీరవాణి ఇతర చిత్రబృందాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.
‘‘ఇదొక అద్భుతమైన, చారిత్రక విజయం. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటునాటు’కి గానూ కీరవాణి గోల్డెన్‌గ్లోబ్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌కు నా అభినందనలు. దేశం మిమ్మిల్ని చూసి గర్విస్తోంది. సంగీతం, డ్యాన్స్.. ఈ రెండింటి సెలబ్రేషనే ‘నాటునాటు’. మన దేశమే కాదు ప్రపంచం మొత్తం ఈరోజు మీతో కలిసి డ్యాన్స్ చేస్తోంది. చరణ్, తారక్‌తోపాటు అద్భుతమైన సాహిత్యం అందించిన చంద్రబోస్, ఉర్రూతలూగించేలా ఆలపించిన రాహుల్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌కు కంగ్రాట్స్’’ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







