దుబాయ్‌లో 79,617 లాంగ్ టెర్మ్ రెసిడెన్సీ పర్మిట్లు జారీ
- January 11, 2023
దుబాయ్: నైపుణ్యం కలిగిన నిపుణులు, ఎంటర్ ప్రెన్యూర్స్, పెట్టుబడిదారులు తదితర వృత్తి నిపుణులకు గత సంవత్సరంలో సుమారు 79,617 గోల్డెన్ వీసాలను జారీ చేసినట్లు దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 69 శాతం పెరిగిందని తెలిపింది. 2022లో మొత్తం 79,617 లాంగ్ టెర్మ్ రెసిడెన్సీ వీసాలను జారీ చేయగా.. 2021లో 47,150 రెసిడెన్సీ వీసాలను జారీ చేశారు. 2019లో ప్రారంభించబడిన గోల్డెన్ వీసా పథకం ఇటీవల మరిన్ని రంగాల నిపుణులకు విస్తరించడం, కనీస నెలవారీ జీతాన్ని Dh50,000 నుండి Dh30,000కి తగ్గించడం లాంటి చర్యలతో లాంగ్ టెర్మ్ రెసిడెన్సీ వీసాలకు డిమాండ్ పెరిగింది.
తాజా వార్తలు
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కంకర లారీ ఢీ.. 19 మంది మృతి..
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!
- ఒమన్ లో ఫుడ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం..!!
- కువైట్ ఎయిర్ పోర్టుల్లో ఇకపై నో బయోమెట్రిక్..!!
- బీచ్ క్లీన్-అప్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన..!!
- మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!







