విశిష్టగౌరవం
- January 11, 2023
విశ్వవేదికపై విరిసిన చిరునవ్వులు
తెలగుభాషకి దక్కిన విశిష్టగౌరవం
తెలుగుపదాల కమ్మనైన సోయగం
పల్లెపాటకిలభించే ఘనమైన సత్కారం....
చంద్రబోస్ స్వీయవిరచిత మాధుర్యం
అక్షరాలకి సొబగులద్దిన వారివైనం
కవికలం నుంచిజాలువారిన ఆణిముత్యం
పాటపాటలో పొదిగిన అక్షరవైఢూర్యం..
ఆర్ఆర్ఆర్ చిత్రానికి బాణీలసంగీతం
కీరవాణి సరిగమలకి దాసోహం
ఉట్టిపడే రాజమౌళి సాహసరాజసం
అందుకొన్నారు గ్లోబల్ బహుమానం .....
తెలుగుపాటకి దక్కిన సగర్వవిజయం
తెలుగునేలపై ఎగిరిన విజయకేతనం
నాటునాటు పాట జానపద నిదర్శనం
తెలుగుభాషకే పట్టం కట్టిన చిత్రరాజం .....
పదంపదంలో తొణికిసలాడే వయ్యారాలు
హవభావాలతో అధ్భుత నృత్యగీతికలు
సినీచరితలో నిండైన నీరాజనాలు
అపురూపమైన ఙ్ఞాపిక సుమధుర కానుక....
--యామిని కోళ్ళూరు(అబుధాభి)
తాజా వార్తలు
- బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్
- అనుమతి లేకుండా ఫోటోలు వాడిన మసాజ్ సెంటర్ల పై కేసు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్
- ఇరాన్ దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత
- తెలంగాణ: షోరూమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్
- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్
- TTD ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- మలేషియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్: సెమీస్‌కు పీవీ సింధు
- అబుదాబిలో 7 మోటార్‌బైక్ ప్రమాదాలు.. 9 మందికి గాయాలు..!!
- సల్మియా మార్కెట్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- బు సిల్లా ఇంటర్‌ఛేంజ్‌పై తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు..!!







