‘వీర సింహారెడ్డి’ మూవీ రివ్యూ.!
- January 12, 2023
‘అఖండ’ సినిమాతో సూపర్ హిట్టు కొట్టి జోరు మీదున్న బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో, ‘వీర సింహారెడ్డిపై ఓ రేంజ్‌లో అంచనాలు నెలకొన్నాయ్. డైరెక్టర్ పరంగా చూస్తే, ‘క్రాక్’ సినిమాతో హిట్టు కొట్టిన గోపీచంద్ మలినేని కూడా హుషారు మీదే వుండడంతో, ‘వీర సింహారెడ్డి’ ఖచ్చితంగా సూపర్ హిట్ సినిమా అని అంచనా వేశారు. అయితే, ఆ అంచనాల్ని ‘వీర సింహుడు’ అందుకున్నాడో లేదో తెలియాలంటే, కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
వీర సింహారెడ్డి (బాలకృష్ణ), భానుమతి (వరలక్ష్మీ శరత్ కుమార్) ఇద్దరూ ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు. కానీ, వీర సింహారెడ్డి అంటే, భానుమతికి అస్సలు నచ్చదు. శత్రువులా భావిస్తుంది. పగతో రగిలిపోతుంటుంది. అన్న మీద పగతోనే శత్రువుని పెళ్లి చేసుకుంటుంది భానుమతి. కానీ, చెల్లెలు భానుమతి అంటే, వీర సింహారెడ్డికి ప్రాణం. అన్నపై అత్యంత అసహ్యం పెంచుకున్న భానుమతి, పని మీద విదేశాలకు వెళ్లిన వీరసింహారెడ్డిని హత్య చేయిస్తుంది. మరోవైపు జయ సింహా (జూనియర్ బాలయ్య), తల్లి మీనాక్షి (హనీ రోజ్)తో కలిసి ఇస్తాంబుల్‌లో జీవిస్తుంటాడు. కొడుకు జయ సింహా తండ్రికి దూరంగా ఎందుకున్నాడు.? నిజంగానే వీర సింహారెడ్డి చనిపోయాడా.? సవతి చెల్లెలు భానుమతికి అన్న వీర సింహారెడ్డి అంటే ఎందుకంత పగ.? తండ్రి గురించి తెలుసుకున్న జయ సింహారెడ్డి సీమకు తిరిగొచ్చి ఏం చేశాడు.? తెలియాలంటే, ‘వీర సింహారెడ్డి’ సినిమా ధియేటర్లో చూడాల్సిందే.
నటీనటుల పని తీరు:
ఎప్పటిలాగే బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. సీమ కథలు అసలే బాలయ్యకు కొట్టిన పిండి. తెరపై ఆ అనుభవాన్ని మరోసారి రంగరించాడు బాలయ్య. హీరోయిన్‌గా శృతి హాసన్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. కానీ, వున్నంతలో గ్లామర్‌తో ఆకట్టుకుంది. హనీ రోజ్ బాలయ్యకు భార్యగా, తల్లిగా రెండు పాత్రలను విజయవంతంగా పోషించింది. కథకు అత్యంత కీలకమైన పాత్ర వరలక్ష్మి శరత్ కుమార్. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది వరలక్ష్మి శరత్ కుమార్. మరోసారి ఆమె మంచి నటి అని నిరూపించుకుంది. విలన్ పాత్ర పోషించిన దునియా విజయ్, నవీన్ చంద్ర తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతిక వర్గం పని తీరు:
పాత కథనే కొత్తగా చూపించాలని తాపత్రయ పడ్డాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. కానీ, హండ్రెడ్ పర్సంట్ సక్సెస్ కాలేదు. ఫస్ట్‌ఫ్ అంతా బోరింగ్‌గా నడిపించాడు. సెకండాఫ్ కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. పాత్రల పర్‌ఫామెన్స్‌తో కథలో వేగం పుంజుకున్నట్లుగా తోస్తుంది. నవీన్ నూలి ఎడిటింగ్ విషయంలో కత్తెరలు చాలానే అవసరమనిపిస్తుంది. థమన్ మ్యూజిక్ ఆడియో వరకూ మోత మోగింది కానీ, ఆర్ ఆర్‌పై ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయ్. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ రిచ్‌గా వుంది. బాలయ్య పంచ్ డైలాగులు మాస్ జనాల్ని బాగా ఆకట్టుకుంటాయ్.
ప్లస్ పాయింట్స్
బాలయ్య నటన,
సెకండాఫ్, యాక్షన్ సీన్స్..
మైనస్ పాయింట్స్
పాత కథ, స్లో నెరేషన్,
ఫస్టాఫ్ బోరింగ్ సన్నివేశాలు..
చివరిగా:
‘వీర సింహారెడ్డి’ మాస్ ఫ్యాన్స్‌కి మాత్రమే ఫుల్ మీల్స్ అందిస్తుంది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ.. వ్యక్తికి జైలు శిక్ష
- గ్రాండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుక: విజేతలకు బహుమతుల అందజేత
- సౌదీలో గణనీయంగా పెరిగిన బీమాదారులు
- ఏడాదిలో 7,000 మంది ప్రవాసులు అరెస్ట్
- అజ్మాన్ లో ఇంధన ట్యాంక్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
- యూఏఈ స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోత పొడిగింపు
- హైదరాబాద్‌లో భారీ వర్షం..
- తొమ్మిదేళ్ల పాలనలో కెసిఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం