సొంతూళ్లకు పయనమైన హైదరాబాద్ వాసులు..

- January 12, 2023 , by Maagulf
సొంతూళ్లకు పయనమైన హైదరాబాద్ వాసులు..

హైదరాబాద్: సంక్రాంతి వచ్చిందంటే చాలు చాలు హైదరాబాద్ నగరం ఖాళీ అవుతుంది. దాదాపు 75 % మంది సొంతూళ్లకు పయనమవుతారు. తెలుగు ప్రజలు జరుపుకునే పండగల్లో సంక్రాంతి పెద్ద పండగ. తెలంగాణ లో కంటే ఆంధ్ర ప్రదేశ్ లో ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరే సంక్రాంతి పండగకు వారి సొంత ఊరికి వచ్చి కుటుంబ సభ్యులతో గ్రామస్థులతో పండగను జరుపుకుంటారు. సినీ, రాజకీయ , సామాన్య ఇలా అంత కూడా తమ ఫ్యామిలీ సభ్యులతో ఘనంగా ఓ వారం పాటు ఘనంగా జరుపుకుంటారు.

ఇక ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకలే కనిపిస్తున్నాయి. ఈరోజు నుండి స్కూల్స్ , కాలేజీలకు సెలవులు ఇవ్వడం తో సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో అన్ని టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అధికమైంది. ఈనేపథ్యంలో చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. అయితే టోల్‌గేట్ల వద్ద ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా అధికారులు ముందుగానే చర్యలు తీసుకున్నారు. టోల్ బూత్‎లలో రెండు సెకన్లకే వాహనాలు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయడంతో వాహనాలు తొందరగా వెళ్తున్నాయి. జాతీయ రహదారిపై యాక్సిడెంట్‌ జోన్‌, బ్లాక్‌ స్పాట్‌ల వద్ద అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు హైవేపై గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. పంతంగితోపాటు కొర్లపాడ్‌, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద పటిష్ట చర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com