త్వరలోనే ఒమన్ లో యూపీఐ చెల్లింపులు

- January 13, 2023 , by Maagulf
త్వరలోనే ఒమన్ లో యూపీఐ చెల్లింపులు

మస్కట్: ఒమన్ తో సహా ఇతర తొమ్మిది దేశాల్లోని ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) త్వరలోనే తమ అంతర్జాతీయ మొబైల్ నంబర్‌లను ఉపయోగించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చెల్లింపులు చేయొచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం, 10 దేశాల్లోని ప్రవాస భారతీయులు (NRIలు) వారి భారతదేశ ఫోన్ నంబర్‌పై ఆధారపడకుండా లావాదేవీల కోసం UPI సేవలను యాక్సెస్ చేయవచ్చు. యూఏఐ పేమెంట్లు అందుబాటులోకి వచ్చే 10 దేశాల్లో ఒమన్‌, సింగపూర్, యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, యూకే ఉన్నాయి. ఆయా దేశాలు ఏప్రిల్ 30 లోపు యూపీఏ పేమెంట్లను మొదలు పెడతాయని ఎన్పీసీఐ తెలిపింది. మరోవైపు రూపే డెబిట్ కార్డ్‌లు, తక్కువ-విలువైన BHIM-UPI లావాదేవీలను ప్రోత్సహించడానికి INR2,600 కోట్ల పథకానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com