మక్కా గ్రాండ్ మస్జీదుకు ఉచిత షటిల్ సేవలు ప్రారంభం

- January 13, 2023 , by Maagulf
మక్కా గ్రాండ్ మస్జీదుకు ఉచిత షటిల్ సేవలు ప్రారంభం

జెద్దా: జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం యాత్రికుల కోసం ఉచిత షటిల్ సేవను ప్రారంభించింది. ఈ కొత్త సర్వీస్ యాత్రికులను విమానాశ్రయంలోని టెర్మినల్ 1 నుండి మక్కాలోని గ్రాండ్ మస్జీదుకు తీసుకువెళుతుందని విమానాశ్రయం ట్విట్టర్‌లో ప్రకటించింది. "లబ్ధిదారులు తప్పనిసరిగా ఇహ్రామ్ ధరించాలి. సౌదీల కోసం జాతీయ ID లేదా విదేశీయుల పాస్‌పోర్ట్‌ను తప్పనిసరిగా సమర్పించాలి." అని తన ట్వీట్ లో పేర్కొంది. విమానాశ్రయం నుండి ప్రతి రెండు గంటలకు ఒక సర్వీసు ప్రారంభం అవుతుంది. ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు షటిల్ సర్వీసుల సేవలు అందుబాటులో ఉంటాయి. తిరిగి మధ్యాహ్నం 12 నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు గ్రాండ్ మస్జీదు నుండి షటిల్ సర్వీసులు తిరుగు ప్రయాణం అవుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com