కొత్త జెబెల్ జైస్ రోడ్డు ప్రారంభం.. 75% ప్రయాణ సమయం ఆదా
- January 13, 2023
యూఏఈ: జెబెల్ జైస్‌కు నిర్మించిన కొత్త రహదారి ప్రారంభమైంది. ఇది దేశంలోని ఎత్తైన శిఖరానికి వెళ్లే వాహనదారుల సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. రింగ్ రోడ్ నుండి కొత్త జెబెల్ జైస్ రహదారి వాడి హకీల్ ప్రాంతం గుండా వెళుతూ.. ఎమిరేట్స్ రోడ్‌కి కలుపుతుందని రస్ అల్ ఖైమాలోని పబ్లిక్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఈ కొత్త 8.6-కిలోమీటర్ల రహదారిని దాటేందుకు కేవలం నాలుగు నిమిషాల సమయం పడుతుంది. వాడి అల్ బీహ్ పాత మార్గంతో వాడి షిహా రోడ్‌లోని కనెక్షన్ పాయింట్‌తో పోల్చినప్పుడు ప్రయాణ సమయం 75 శాతం తగ్గుతుందని డిపార్ట్‌మెంట్ తెలిపింది.
రస్ అల్ ఖైమా ఎత్తైన శిఖరాన్ని సందర్శించే పర్యాటకులకు, ఎమిరేట్‌లో పట్టణ విస్తరణ అవసరాలను వేగవంతం చేసే లక్ష్యంతో ఈ రహదారి నిర్మాణం చేపట్టారు. దేశంలో అత్యధికంగా సందర్శించే ప్రదేశాలలో జెబెల్ జైస్ ఒకటి. దీంతో కొత్త రహదారి ఉత్తర ఎమిరేట్‌లో పర్యాటక రంగాన్ని మరింతగా పెంచుతుందని డిపార్టుమెంట్ పేర్కొంది. రాస్ అల్ ఖైమా గత సంవత్సరం అత్యధిక వార్షిక సందర్శకుల సంఖ్య(1.13 మిలియన్లు)ను సాధించింది. 2021తో పోలిస్తే 15.6 శాతం పెరుగుదల నమోదైంది. రహదారి నిర్మాణంలో సుమారు 2.6 మిలియన్ క్యూబిక్ మీటర్ల రాతిని తవ్వితీశారు.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







