తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- January 13, 2023
అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు, ప్రత్యేకించి రాష్ట్ర ప్రజానీకానికి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియ జేశారు.భోగి మంటలు, రంగ వల్లులు, హరి దాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, ధాన్యపు సిరులు గ్రామ సీమలకు సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని గవర్నర్ పేర్కొన్నారు.సంక్రాంతి మన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే అచ్చ తెలుగు పండుగ అన్నారు.పండుగ శుభవేళ తెలుగు లోగిళ్ళలో ఆనంద సిరులు వెల్లివిరియాలన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వ దినాలను ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని. ఈ పండుగ సంబరాలు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో పురోగతిని తీసుకురావాలని గవర్నర్ హరిచందన్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







