ఖతార్ లో భారతీయ అల్ట్రా రన్నర్ సుఫియా రికార్డు పరుగు

- January 14, 2023 , by Maagulf
ఖతార్ లో భారతీయ అల్ట్రా రన్నర్ సుఫియా రికార్డు పరుగు

దోహా: మూడుసార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయిన భారతీయ అల్ట్రా రన్నర్ సుఫియా సూఫీ ఖాన్.. ఎఫ్‌కెటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని జనవరి 13న విజయవంతంగా సాధించారు. 30 గంటల 34 నిమిషాల్లో ప్రో-అథ్లెట్ 'రన్ అక్రాస్ ఖతార్'లో భాగంగా తన మొదటి అంతర్జాతీయ సాహసయాత్రను పూర్తి చేసింది. 200 కి.మీ సౌత్ టు నార్త్ అల్ట్రామారథాన్ రన్ ను విజయవంతంగా పూర్తి చేసింది. జనవరి 12 ఉదయం అబూ సమ్రా నుండి ప్రారంభమైన రన్.. జనవరి 13 మధ్యాహ్నం అల్ రువైస్‌లోని జులాల్ వెల్నెస్ రిసార్ట్‌లో ముగిసింది. మరొక గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టడంతోపాటు పరుగు వంటి శారీరక శ్రమల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని నడిపించడంపై అవగాహన పెంచడమే తన లక్ష్యమని సుఫియా చెప్పారు. పరుగుకు ముందు ఆమె మాట్లాడుతూ.. "కాలినడకన ప్రపంచాన్ని చుట్టుముట్టడం నా కల. దానిని సాధించడానికి నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నాను." అని పేర్కొన్నారు.

37 ఏళ్ల సుఫియా సూఫీ ఖాన్ భారతదేశం అంతటా సుదూర పరుగు లక్ష్యాలను సాధించడంలో ప్రసిద్ధి చెందారు. 2019లో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అత్యంత వేగంగా ప్రయాణించిన మహిళగా, 2021లో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ రన్‌ను పూర్తి చేసిన మహిళగా, 2022లో మనాలి-లేహ్ హిమాలయన్ అల్ట్రా రన్ ఛాలెంజ్‌ను కవర్ చేసిన మహిళగా ఆమె ప్రపంచ రికార్డులు సాధించింది.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com