అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగానే హజ్ ప్యాకేజీలు
- January 15, 2023
రియాద్: హజ్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్న సీట్లపై ఆధారపడి ఉంటాయని, ఇవి నిరంతరం అప్డేట్ అవుతుంటాయని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రిజర్వేషన్ చేసుకునేందుకు ఉన్న ఆప్షన్‌లను పరిశీలిస్తున్నప్పుడు అన్ని హజ్ ప్యాకేజీలు ఎందుకు కనిపించడం లేదని అడిగిన ప్రశ్నకు మంత్రిత్వ శాఖ ఈ మేరకు వివరణ ఇచ్చింది. రిజర్వేషన్ స్థితికి సంబంధించి, దరఖాస్తుదారు తన వెబ్‌సైట్ లేదా నుసుక్ యాప్ ద్వారా హజ్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు రిజర్వేషన్ స్థితిని తనిఖీ చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. Etamarna యాప్‌ను రద్దు చేయాలని, అన్ని యాత్రికులకు సంబంధించిన సేవలను Nusuk యాప్ ద్వారా విస్తరించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. యాత్రికుల కోసం రిజిస్ట్రేషన్ విధానాలను సులభతరం చేయడానికి Etamarna యాప్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







