కువైట్ యూనివర్శిటీ సంచలన నిర్ణయం..
- January 15, 2023
కువైట్ సిటీ: కువైట్ లో రోజురోజుకు అన్ని రంగాలలో అంత కంతకు పెరిగిపోతున్న వలసదారుల ప్రాబల్యాన్ని తగ్గించి స్థానికులకు ప్రాధాన్యం కలిగించే ఉద్దేశంతో 2017లో కువైట్ ప్రభుత్వం కువైటైజేషన్ పాలసీని తీసుకొచ్చింది.ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన అన్ని సంస్థలలో దీన్ని ఇంప్లీమెంట్ చేసేందుకు ఆ దేశ సివిల్ సర్వీస్ విభాగం ఐదేళ్ల గడువు ఇచ్చింది.2022తో ఈ గడువు ముగిసింది.దాంతో ప్రస్తుతం ఆ దేశంలో ఈ పాలసీని చాలా కఠినంగా అమలు చేస్తున్నారు.దాంతో గడిచిన రెండేళ్ల నుంచి ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి వేలాది మంది ప్రవాసులు స్వదేశాలకు తరలిపోయారు.
కువైట్ యూనివర్శిటీ కువైటైజేషన్ పాలసీని అమలు చేసే విషయంలో తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.నాలుగు సంవత్సరాల పాటు కువైటీకరణను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు కువైట్ యూనివర్శిటీ తాత్కాలిక డైరెక్టర్ డా.సుయాద్ అల్-ఫద్లీ, తాత్కాలిక సెక్రటరీ జనరల్ డా.ఫయేజ్ అల్-దాఫిరి, డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ సెక్రటరీలకు ఈ నిర్ణయం తాలూకు కాపీని తమ వద్ద ఉంచుకోవాలని యూనివర్సిటీ కౌన్సిల్ ఆదేశించింది.కాగా, యూనివర్శిటీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ దేశంలో విద్యానభ్యసించే విదేశీ విద్యార్థులకు మేలు జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







