రియో ఒలింపిక్స్‌లో భారత బృందానికి రాయబారిగా సచిన్
- April 29, 2016
: రియో ఒలింపిక్స్‌లో భారత బృందానికి సహృద్భావ రాయబారిగా వ్యవహరించేందుకు క్రికెట్ లెజెండ్ సచిన్ తెందుల్కర్‌ను భారత ఒలింపిక్ అసోసియేషన్ ఆహ్వానిస్తోంది. ఈవిషయమై ఐఓయే సచిన్‌కు అధికారికంగా లేఖ పంపింది. అయితే సచిన్ దీనికి స్పందించాల్సి ఉంది.దేశ క్రీడాకారుల తరఫున మాట్లాడడానికి సచిన్ ఎప్పుడూ ముందు వరసలో నిలుస్తారు కాబట్టి రాయబారిగా వ్యవహరించడానికి అంగీకరించే అవకాశం ఉంది. బాక్సర్ సరితాయాదవ్ సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో సచిన్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆయన ఒలింపిక్ బృందంలో చేరడం క్రీడాకారుల ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేస్తుందని ఐఓఏ భావిస్తోంది.ఒలింపిక్ గేమ్స్‌కి ప్రజాదరణ పెంచడానికి, కార్పొరేట్లను ఆకర్షించి నిధులు రాబట్టడానికి ఐఓఎ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌ను కూడా రాయబారుల బృందంలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







