ట్రాఫిక్ జరిమానాలపై వైరల్ పోస్ట్.. వివరణ ఇచ్చిన పోలీసులు
- January 17, 2023
యూఏఈ: ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి జరిమానాలు విధించేందుకు ఎమిరేట్ వీధుల్లోని నిఘా కెమెరాలను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలను అజ్మాన్ పోలీసులు ఖండించారు. సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్ట్ ఫేక్ అని పోలీసులు తెలిపారు. ఎవరు పోస్ట్ చేశారనే దానిపై దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేస్తామని అధికార యంత్రాంగం తెలిపింది. యూఏఈ నకిలీ వార్తలకు వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. ఒక ఫెడరల్ చట్టం ప్రకారం.. తప్పుడు వార్తలు, పుకార్లు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రచురించడం, ప్రసారం చేయడం లేదా వ్యాప్తి చేయడం కోసం Dh100,000 జరిమానా, జైలు శిక్షను విధించే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







