‘ఆహా’.! బాలయ్య - అల్లు రిలేషన్ ‘అన్‌స్టాపబుల్’.!
- January 17, 2023
‘అన్‌స్టాపబుల్’ షోతో తొలిసారిగా బాలయ్యతో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఈ టాక్ షో ద్వారా పలువురు రాజకీయ, సినీ ప్రముఖ సెలబ్రిటీలకు సంబంధించిన పర్సనల్ అండ్ ప్రొఫిషనల్ ఇష్యూస్‌ని ప్రేక్షకులకు తెలియచెప్పే ప్రయత్నం చేశారు.
ఈ షో బాగా పాపులర్ అయ్యింది. దాంతో, ఈ తరహాలోనే మరో కొత్త ప్రోగ్రామ్‌కి అల్లు అరవింద్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షోకీ బాలయ్యనే హోస్ట్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారట.
త్వరలోనే ఆ ప్రోగ్రామ్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి చేయనున్నారనీ తెలుస్తోంది. అన్నట్లు అసలు మ్యాటర్ వేరే వుందండోయ్. అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఓ పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నారట.
ఎవరితోనో తెలుసా.? ఇంకెవరితో.! బాలయ్యతోనే. ఈ మధ్య గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో సినిమాలేమీ రావడం లేదు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ద్వారానే చిన్న సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అతి త్వరలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో బాలయ్యతో ఓ పెద్ద ప్రాజెక్ట్‌కి లైన్ క్లియర్ చేస్తున్నారట అల్లు అరవింద్. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందట. అదీ సంగతి.
తాజా వార్తలు
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







