నోటి దుర్వాసనకు చెక్‌పెట్టండిలా
- June 18, 2015
సాల్ట్ కేవలం వంటకాల్లో టేస్ట్నివ్వడమే కాదు. సహజ మెడిసన్‌లా కూడా పని చేస్తుంది. కొంతమంది మాట్లాడుతుంటే నోటి నుండి దుర్వాసన వస్తూ, ఎదుటివారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని పోగొట్టాలంటే సాల్ట్‌తో చిన్న చిట్కా. పావుకప్పు నీటిలో చిటికెడు ఉప్పు, పావు చెంచా వంట సోడా కలిపి అరగంట సేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత ఆ నీటితో నోటిని పుక్కిలించినా, నోటిలోని ఫంగస్, బాక్టీరియా తొలగిపోయి, నోరు తాజాగా ఉంటుంది. కొంతమందికి గోర్లు పసుపు రంగులోకి మారతాయి. అలాంటి వారు ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా వంటసోడా తీసుకుని దానికి ఒక నిమ్మకాయ రసం కలిపి పేస్ట్‌లా చెయ్యాలి. ఈ పేస్ట్‌ని గోళ్లకి పూతలా వేపి, ఆరాక గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చెయ్యడం వల్ల గోళ్లు క్రమక్రమంగా వాటి రంగులోకి మారతాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







